సఃకుటుంబానాం చిత్ర రివ్యూ
హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే...
సఃకుటుంబానాం కథ :
ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలోని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే యువకుడు తన కుటుంబం పై అతి ప్రేమతో ఉంటాడు. అలా ప్రశాంతంగా ఉన్న అతని టీంకు ఒక అమ్మాయి వస్తుంది. వారి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. అయితే ఆ అమ్మాయి వారి జావితంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో వచ్చిన మార్పులు ఎటువంటివి? బయట పడిన విషయాలు ఎలాంటివి? వారి కుటుంబం వల్ల అతని జీవితంలో వచ్చిన మార్పులు ఎటువంటివి? చివరి వరకు ఆ కుటుంబం అంతా కలిసి ఉంటారా లేదా? అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏంటి? వారి జీవితాలలోకి విలన్ ఎలా వస్తాడు? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై సఃకుటుంబానాం చిత్రం చూడాల్సిందే.
సఃకుటుంబానాం నటీనటుల నటన :
ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన రామ్ కిరణ్ తన డాన్స్ తో పాటు తన నటనను కూడా ప్రూవ్ చేసుకున్నారు. యాక్షన్ నుండి ఎమోషన్ వరకు ప్రతి సీన్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే తన లుక్స్ పరంగా రెండు లుక్స్ లో చిత్రంలో కనిపిస్తూ తొలి చిత్ర నటుడు అనే సందేహం కూడా ప్రేక్షకులకు రాకుండా చిత్రం అంతటా చాలా బాగా నటించారు. హీరోయిన్ గా మెగా ఆకాష్ ఇప్పటికే ఎన్నో చిత్రాలలో నటించిన ప్రూవ్డ్ నటి అయినప్పటికీ ఈ చిత్రంలో కాస్త అమాయకత్వంతో, అలాగే మరొక సీన్ లో వచ్చేపటికి ఎంతో స్మార్ట్ గా కనిపిస్తూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు తండ్రి పాత్రలో సహజంగా జీవించారు. చిత్రంలో కీలక పాత్రలు పోషించిన బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తదితరులు వెండి తెరపై కనిపించింది తక్కువ అయినప్పటికీ తమ పాత్రలకు తగ్గట్లు ఎంటర్టైన్ చేస్తూ చిత్రం అంతటా కనిపిస్తూ సినిమాను ముందుకు నడిపారు.
సఃకుటుంబానాం సాంకేతిక విశ్లేషణ :
ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న సినిమాలకు భిన్నంగా సరికొత్త కథతో వెండతెరపై సినిమాలా చూపించడంలో దర్శకుడు ఉదయ్ శర్మ విజయం సాధించారు. కలరింగ్ ఇంకా విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. తద్వారా డిఓపి పనితీరు అర్థం అవుతుంది. సినిమా అంతట హీరో ఇంకా హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల కాసింస్ కూడా చాలా బాగున్నాయి. సినిమాకు బిజిఎంతోపాటు పాటలు ఇంకా డాన్స్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. లొకేషన్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలు బాగున్నాయి.
సఃకుటుంబానాం ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, డాన్స్, ఇంటర్వెల్.
సఃకుటుంబానాం మైనస్ పాయింట్స్ :
కొన్ని స్లో సీన్స్
సఃకుటుంబానాం సారాంశం :
కుటుంబ విలువలను కుటుంబంలోని విభేదాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో చూపిస్తూ వాటి వల్ల కుటుంబం ఎంత బలపడుతుందో నేర్పిస్తూ కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం సఃకుటుంబానాం.
2.5/5