చాలామంది అంటే మోడల్స్ అయినా, హీరోయిన్స్ అయినా తోటి నటులతో అయినా, లేదంటే ఫ్రెండ్స్ తో అయినా ప్రేమలో పడి అందులో కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది రిలేషన్ లో ఫెయిల్ అవుతారు. ఇద్దరిలో తప్పు లేకుండా అయితే బ్రేకప్ అవ్వదు, లేదంటే ఎవరో ఒకరు తప్పు చేసి ఆ రిలేషన్ ని బ్రేక్ చేసుకుంటారు. మరికొందరు వాడుకుని వదిలేస్తారు.
ఈ చివరి కేటగిరీలోకి బిగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా వస్తుంది. తాను నమ్ముకున్న రిలేషన్ తనని మోసం చెయ్యడంతో తాగుడుకు అలవాటు పడి లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారాల్లో ఎలాంటి పెరఫార్మెన్స్ లేకుండా చివరి వారాల్లో గ్లామర్ గాను, టాస్క్ ల పరంగా ఆకట్టుకుని స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇనాయ సుల్తానా బయటికి వచ్చింది.
ఆ తర్వాత ఏవేవో సినిమాలు చేసింది, గ్లామర్ మోత మోగించింది, కానీ ఎందులోనూ సక్సెస్ అవ్వలేదు. తాజాగా ఇనాయ ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ తాను ఒకరితో డేటింగ్ చేశాను, కానీ తనని అతను శరీరాకంగాను, మానసింకంగాను వాడుకుని బాధపెట్టారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇనాయ అలా ఓ రిలేషన్ లో సఫర్ అయినట్లుగా చెప్పుకొచ్చింది.