మోహన్ లాల్ నటించిన సినిమా అంటే ఎట్లుండాలి, ఆయన గెస్ట్ రోల్ చేసినా దానికి ఎంత క్రేజ్ ఉండాలి, కానీ మలయాళంలో తెరకెక్కిన వృషభ విషయంలో ఎందుకు తేడా కొట్టింది. సమర్జిత్ లంకేష్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన వృషభ లో మోహన్ లాల్ నటించారు. కానీ ఆ సినిమా చూసాక మోహన్ లాల్ ఈ సినిమాని ఒప్పుకుని తప్పు చేసారని ఆయన అభిమానులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
వృషభ టాక్ చూసి మోహన్ లాల్ ని యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మోహన్ లాల్ సినిమాకి ఇలాంటి కలెక్షన్సా అంటూ వెటకారం చేస్తున్నారు. మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలోనే వృషభకి దారుణమైన నెంబర్లు రావడం, వీకెండ్ పెరఫార్మెన్స్ లోను వీక్ కలెక్షన్స్ రాబట్టడం వృషభ ని ట్రోల్ అయ్యేలా చేసింది.
ఈ ఏడాది అద్భుతమైన సినిమాలతో కళ్ళు చెదిరే కలెక్షన్స్ రాబట్టిన మోహన్ లాల్ ఈ చిత్రంలో నెగిటివిటి మూటగట్టుకున్నారు. వృషభ సినిమాకి లక్షల్లో కలెక్షన్స్ రావడం ఆయన అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. వృషభ - ఇంతకన్నా అవమానం ఏముంటుంది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.