బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా గెలిచిన ఆర్మీ మ్యాన్, కామనర్ కళ్యాణ్ పడాల సక్సెస్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా ట్రోఫీ ఎత్తిన కళ్యాణ్ పడాల ముందుగా ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లో సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుని ఆతర్వాత తన సొంత ఊరిలో భారీ ర్యాలీతో అడుగుపెట్టాడు.
కళ్యాణ్ పడాల సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఆ నియోజకవర్గ ఎమ్యెల్యే పాల్గొనడం, అభిమానుల నడుమ కేక్ కట్ చేసి కళ్యాణ్ పడాల స్పీచ్ లు ఇవ్వడం, ఆతర్వాత కాలేజీలో కళ్యాణ్ కి సన్మానం అబ్బో కళ్యాణ్ సక్సెస్ జోరుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కప్ ఎత్తాక రిలాక్స్ అవ్వకుండా ఇంకా ఇంకా సెలెబ్రేషన్స్ తోనే కళ్యాణ్ పడాల హడావిడిగా కనబడుతున్నాడు.
ఈ సెలెబ్రేషన్స్ ని, ఈ అభిమానగణం చూసి కళ్యాణ్ పడాల ఎప్పటివరకు ఎంజాయ్ చేస్తాడో కానీ.. కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యావు, నెక్స్ట్ ఏమిటి.. ఇకపై సినిమాల్లోకి వస్తావా లేదంటే ఆర్మీ లోనే కంటిన్యూ అవుతావా అంటూ కళ్యాణ్ పడాల ను కొంతమంది అడుగుతుంటే.. సినిమాల్లేవ్, ఏమి లెవ్.. బిగ్ బాస్ కప్ చూసుకుని రాంగ్ స్టెప్ వెయ్యకు బ్రో అంటూ సలహాలు ఇస్తున్నారు.
కానీ కళ్యాణ్ ఆర్మీ ని వదిలేసి సినిమాల్లోకి రావాలనే పట్టుదలతో కనిపించడం గమనార్హం. చూద్దాం కళ్యాణ్ పడాల నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నాడో అనేది.