దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్రా పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. రుద్రా గా డిఫ్రెంట్ లుక్ లో మహేష్ కనిపించనున్నారు. వారణాసి గ్లింప్స్ లో మహేష్ లుక్, ఆయన కేరెక్టర్ రివీల్ కాగా.. మహేష్ ని శ్రీరాముడి పాత్రలో చూపించబోతున్నట్టుగా రాజమౌళి రివీల్ చేసారు.
అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ఏకంగా ఐదు పాత్రల్లో కనిపిస్తారట. శ్రీరాముడిగా, శివుడిగా, అలాగే మరో రెండు కేరెక్టర్స్ తో పాటుగా మహేష్ అసలు రుద్ర పాత్రలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారట, వారణాసి లో రుద్రా పాత్రే కీలకం అని.. ఆ మిగత నాలుగు పాత్రాలు జస్ట్ ఆలా వచ్చి వెళతాయని తెలుస్తుంది.
ఇక మహేష్ బాబు 2026 సమ్మర్ కల్లా వారణాసి చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ఫ్రీ అవుతారనే టాక్ వినబడుతుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకినీ గా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కుంభ గా విలన్ రోల్ లో కనిపించబోతున్నారు. మహేష్ కి తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.