విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ ఇండస్ట్రీకి ఎప్పుడు? వస్తాడు? అన్నది అప్పుడే చెప్పలేం అన్నది పాత మాట. అర్జున్ వయసు రీత్యా చూస్తే హీరోగా లాంచ్ అవ్వడానికి ఇదే సరైన సమయం. ప్రస్తుతం అర్జున్ వయసు 21 ఏళ్లు. విదేశాల్లో చదువుకుంటున్నాడు. మరో నాలుగేళ్లలో స్టడీస్ పూర్తవుతాయి. ఈనేపథ్యంలో స్టడీస్ అనంతరం అర్జున్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అర్జున్ ఎలా ఉంటాడు? అన్న దానికి ఎలాంటి ప్రూప్ కూడా లేదు.
అతడి పిక్స్ అన్ని కూడా చాలా ప్రయివేట్ గా ఉంటాయి. నెట్టింటి వెతికినా ఒక్క ఫోటో కూడా దొరకదు. అప్పుడెప్పుడో `సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు` ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కనిపించాడు. అప్పుడు అతడి వయసు 10 ఏళ్లలోపు ఉంటుంది. ఆ ఫోటోలు తప్ప కొత్త ఫోటోలేవి దొరకవు. అర్జున్ స్డడీస్ అన్ని విదేశాల్లోనే కావడంతో? కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. హైదరాబాద్ కి అప్పుడప్పుడు వచ్చి వెళ్లడం తప్ప ఇండియాలో ఉండటం కూడా చాలా అరుదు.
విదేశాల్లోనే ఎక్కువగా ఉంటాడు. అక్కడ లైఫ్ స్టైల్ కే అలవాటు పడి ఉన్నాడు. డాడ్ వెంకటేష్ కూడా విదేశాల్లో చదువుకున్నారు. దీంతో తనయుడిని కూడా వెంకీ విదేశాలకే పరిమితం చేసారు. కానీ నటుడు అవ్వాలనుకుంటే మాత్రం హైదరాబాద్ రాక తప్పదు. మరి అదెప్పుడు జరుగుతుందో చూడాలి. మరో నాలుగేళ్ల అనంతరం అందుకు అవకాశాలైతే ఉన్నాయి. నిర్మాతగా రామానాయుడు ఎన్నో విజయాలు చూసారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఓ లెజెండ్ గా ఎదిగారు.
మూవీ మోఘల్ గా ఖ్యాతికెక్కారు. భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు నిర్మించిన నిర్మాతగా ఘన చరిత్ర ఆయన సొంతం. ఆయన వారుసులు పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ హీరో గా స్థిరపడగా, పెద్ద కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా స్థిరపడ్డారు. సురేష్ బాబు ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు రానా నటుడిగా, నిర్మాతగా రాణి స్తున్నారు. చిన్న కుమారుడు అభిరాం కూడా `అహింస` సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం నుంచి థర్డ్ జనరేష్ చివరి నటుల్లో అర్జున్ ఒక్కడే మిగిలాడు.