నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి శ్రీను ల కలయిక లో పవర్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అఖండ 2 తాండవం కొన్ని ఇబ్బందుల నడుమ డిసెంబర్ 12 న పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 5 న విడుదలైతే అఖండ 2కి భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. డిసెంబర్ 12 న అఖండ 2 కి నార్త్ లో ధురంధర్, ఓవర్సీస్ లో హాలీవుడ్ మూవీస్ థియేటర్స్ ని ఆక్యుపై చేసాయి.
ఇకపోతే సినిమా విడుదలయ్యాక అఖండ 2కి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. అఖండ 2 కి ఆడియన్స్ రెస్పాన్స్ కన్నా క్రిటిక్స్ అఖండ 2 బాగా విమర్శించారు. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ ఎలా ఉన్నా ఈరోజు సోమవారం అఖండ 2కి అగ్నిపరీక్ష అనే చెప్పాలి. ఆదివారం కూడా అఖండ 2 ఆక్యుపెన్సీ కనిపించలేదు.
సోమవారం నుంచి అఖండ 2 పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. అసలే ఓ వర్గం మీడియా అఖండ 2 ని ఆడుకుంటుంది. మరి సోమవారం కలెక్షన్స్ చూస్తే ఆ మీడియాకి మరింత హ్యాపీగా ఉంటుందేమో అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు.