యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఫ్రెష్ షెడ్యూల్ జరుగుతుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుంది.
కాంతార చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లో ఫేమస్ అయిన రుక్మిణి వసంత్ క్రేజ్ మాములుగా లేదు. అయితే రుక్మిణి వసంత్ ఎక్కువగా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది తప్ప గ్లామర్ లుక్స్ అంతగా వదలదు. తాజాగా రుక్మిణి వసంత్ బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ రచ్చ లేపింది. రుక్మిణి వసంత్ న్యూ లుక్ చూడగానే ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ జోడి అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
బ్లాక్ మోడ్రెన్ వేర్ లో చాలా ట్రెండీ గా రుక్మిణి వసంత్ స్టైలిష్ గా కనిపించింది. రుక్మిణి లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.