ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఈవెంట్స్ దగ్గర నుంచి బుల్లితెర షోస్ వరకు సుమ క్రేజ్ ని కొట్టే యాంకర్ లేదు అంటే నమ్మాల్సిందే. అటు సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడే. ఆయన కూడా స్టార్ హీరోలతో మంచి ర్యాపొ మైంటైన్ చేస్తారు.
సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరో గా అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. ఇప్పటికే ఒక సినిమా చేసిన రోషన్ ఇప్పుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో మోగ్లీ చిత్రం చేసాడు. మోగ్లీ ప్రమోషన్స్ అంటే ఎన్టీఆర్ తో టీజర్ లాంచ్, ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ అంటూ హడావిడి చెయ్యడమే కాదు సినిమా ప్రమోషన్స్ ను సందీప్ అండ్ రోషన్ కనకాల గట్టిగా చేసారు.
అయితే డిసెంబర్ 12 న విడుదల కావాల్సిన మోగ్లీ చిత్రం అఖండ 2 వల్ల ఒక్కరోజు లేట్ గా డిసెంబర్ 13 న విడుదలయింది. డిసెంబర్ 12 నైట్ స్పెషల్ ప్రీమియర్స్ తోనే మోగ్లీ సందడి స్టార్ట్ అయ్యింది. అయితే మోగ్లీ చిత్రానికి ఆడియన్స్ నుంచి సినీవిమర్శకుల నుంచి సో సో రెస్పాన్స్ రావడం హైలెట్ అయ్యింది.
ఈ టాక్ తో సినిమా థియేటర్స్ లో ఆడాలి అంటే సుమ కనకాల క్రేజ్ కూడా సరిపోయేలా లేదు. సుమ కి ఈరోజు బిగ్ డే. కొడుకు హీరోగా నటించిన సినిమా విడుదలయింది. కానీ ఆ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ సుమ కి నిద్ర రాకుండా చెయ్యడం మాత్రం గ్యారెంటీ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.