కాంబినేషన్ల కల్చర్ ఇటీవలి కాలంలో విస్త్రతంగా ఉంది. దీనికి ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేదు. పాన్ ఇండియా ట్రెండ్ లో సౌత్ లో అన్ని భాషల నుంచి స్టార్లు కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ - రణ్ బీర్ కపూర్- ఆలియా భట్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూడాలని ఆశిస్తున్నారు అభిమానులు. దీనికి కారణం తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఓ ప్రకటనలో ఈ ముగ్గురు స్టార్లు ఎంతో ఎంథుసియాసిజమ్ తో కనిపించడమే. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ పాపులర్ స్టీల్ బ్రాండ్ ప్రకటన కోసం కలిసి పని చేసారు. ఇది భారీ యాక్షన్ ప్యాక్డ్ అడ్వర్టైజ్‌మెంట్.
నిజానికి ఈ ముగ్గురు స్టార్లు బ్రహ్మాస్త్రలో కలిసి పని చేసారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి ఒక వాణిజ్య ప్రకటన కోసం కలిసి పని చేయడం ఆసక్తిని కలిగించింది. ఇందులో పైరోకైనెటిక్ శక్తులు కలిగిన శివుడి పాత్రలో రణబీర్ కనిపించగా, షారుఖ్ మోహన్ భార్గవ్ పాత్రను పోషించారు. శక్తివంతమైన వానరాస్త్రం (కోతి శక్తి)ను కలిగి ఉన్న వాడిగా ఖాన్ కనిపిస్తున్నాడు. అలాగే ఆలియా శివుడి ప్రేయసి ఇషా పాత్రను పోషించింది. ఖాన్ - రణబీర్ - ఆలియా ప్రకటనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రకటన చూడగానే ఇది ఒక `మినీ మల్టీవర్స్`ని తలపిస్తోందని కితాబిస్తున్నారు. రణబీర్ -షారూఖ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఆ ఇద్దరూ కలిసి ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ కోసం కలిసి పని చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
షారూఖ్ ఖాన్ -రణబీర్ కపూర్ ఒకే ఫ్రేమ్‌లో అత్యుత్తమంగా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మరొక రణబీర్ కపూర్, షారూఖ్ ఖాన్, ఆలియా భట్ క్రాస్ఓవర్ ప్రకటన బావుంది... కానీ ముగ్గురూ కలిసి ఒక యాక్షన్ సినిమా కోసం నటిస్తే చూడాలనుందని ఒక అభిమాని ఉత్సాహం ప్రదర్శించారు. బహుశా ఇలాంటి చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తే అది ఇంకా ఎగ్జయిట్ చేస్తుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అభిమానుల కోరిక మేరకు సిద్ధార్థ్ ఆనంద్ అలాంటి సినిమాని తెరకెక్కించాలని ఆకాంక్షిద్దాం.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, షారూఖ్ ప్రస్తుతం తన తదుపరి యాక్షన్ చిత్రం `కింగ్`లో నటిస్తున్నాడు. యాథృచ్ఛికంగా దీనికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. అదే సమయంలో రణబీర్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్`లో అలియా భట్ - విక్కీ కౌశల్ తో కలిసి నటిస్తున్నాడు. రామాయణంలోను శ్రీరాముడిగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అలియా ప్రస్తుతం గూఢచారి చిత్రం `ఆల్ఫా` విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.