మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మోస్ట్ ఎవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పెద్ది తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఫస్ట్ షాట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ చికిరి చికిరితో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ట్రేడ్‌మార్క్ మెగా గ్రేస్, ఉర్రూతలూగించే స్క్రీన్ ప్రజెన్స్ తో ఈ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
పెద్ది చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం ఒక హై-ఆక్టేన్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. బాలీవుడ్ సంచలనం జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది.
పెద్ది టీం రేపటి నుండి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంచనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, వాటిలో కొన్నింటిని ఢిల్లీలో చిత్రీకరిస్తారు. జనవరి నెలాఖరు వరకు చిత్రీకరణ కొనసాగుతుంది, అప్పటికి సినిమా మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ప్లానింగ్ ప్రకారం, నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి, పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషించడం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది, అలాగే జగపతి బాబు మరియు దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.పెద్ది మార్చి 27, 2026న గ్రాండ్ గా పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.