ప్రస్తుతం రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. రెండో రోజు వివిధ కంపెనీ సీఈవోలతో భేటీ అయిన నారా లోకేష్ మూడో రోజు శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ప్రాజెక్టు టైమ్‌లైన్‌లను మరింత వేగంగా ముందుకు తేవడానికి మార్గాలపై చర్చించారు. రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లీ, కాలిబ్రేషన్, టెస్టింగ్ సదుపాయాల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని గూగుల్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్‌వర్కింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే వంటి కీలక ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుతం గూగుల్ సంస్థకు చెందిన డ్రోన్ విభాగం వింగ్స్ డ్రోన్‌లు చెన్నైలోని ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా తయారవుతున్నాయని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ కీలక సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం AI, క్లౌడ్ కంప్యూటింగ్, ఏరోస్పేస్ వంటి ఫ్యూచర్‌స్టిక్ టెక్నాలజీలలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాప్‌లో ముఖ్యమైన గమ్యస్థానంగా రూపాంతరం చెందుతోందని స్పష్టమవుతోంది.