విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కన్నడ నటి శ్రీనిది శెట్టిని తీసుకున్నారు. ఇది పక్కా ప్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. సినిమాలో వెంకేటష్ పాత్ర పేరు వెంకటరమణ అని తెలిసింది. రమణ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు. `మన శంకర వర ప్రసాద్ గారు` షూటింగ్ లో బిజీగా ఉండటంతో? వీలు పడలేదు. ఇది పూర్తయిన వెంటనే గురూజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. తాజాగా సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.
ఇందులో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ని తీసుకోవాలనుకుంటున్నారుట. అందుకు కారణం లేకపోలేదు. కత్రినా సినీ జీవితం మొదలైంది `మల్లీశ్వరి`తోనే. అందులో విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటించింది. ఇద్దరి కాంబినేషన్ తెరపై అద్భుతంగా పండింది. ఆ సినిమాకు డైలాగులు రాసింది గురూజీనే. దీంతో వెంకీ తాజా సినిమాలో కీలక పాత్రకు కత్రినా అయితేనే బాగుంటుందని గురూజీ భావిస్తున్నాడుట. మరి కత్రినా ఈ ఆఫర్ పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.
`మల్లీశ్వరి` తర్వాత కత్రినా కైఫ్ మళ్లీ బాలయ్యకు జోడీగా `అల్లరి పిడుగు`లో నటించింది. ఆతర్వాత మళ్లీ తెలుగు సినిమాల వైపు చూసింది లేదు. అప్పుడే బాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టి సక్సెస్ అయింది. దీంతో ఇతర భాషల వైపు చూడాల్సిన అవసరం కత్రినాకు పడలేదు. అప్పటి నుంచి హిందీ పరిశ్రమలోనే కొనసాగుతుంది. సౌత్ లో అవకాశాలు వస్తున్నా? వాటిని సున్నితంగా తిరస్కరిస్తోంది. ఆ మధ్య ఓ మలయాళ సినిమా కోసం ప్రయత్నించారు. కానీ నో చెప్పింది.
మరి తెలుగు సినిమా పాన్ ఇండియాని ఎల్తోన్న నేపథ్యంలో వస్తోన్న వెంకీ అవకాశం పట్ల ఎలాంటి నిర్జ్ఞం తీసుకుం టుందో చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయలేదు. చివరిగా గత ఏడాది `మేరీ క్రిస్మస్` తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మరో కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదు.