నిజంగా మూడు చిత్రాల తర్వాత ఫైనల్ గా ఆ హీరోయిన్ హిట్ అందుకుంది. ఆమె ఎవరో కాదు మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన భాగ్యశ్రీ బోర్సేను నమ్ముకుని హీరోయిన్ గా పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే కి ఆ చిత్రం పూర్తి నిరాశనిచ్చింది. తర్వాత విజయ్ దేవరకొండ కింగ్ డమ్ చేసింది. అది కూడా భాగ్యశ్రీ బోర్సే ని బాగా డిజప్పాయింట్ చేసింది.
ఆ నెక్స్ట్ నవంబర్ లో దుల్కర్ సల్మాన్ తో చేసిన కాంత చిత్రం తో హిట్ కొట్టి సెట్ అవ్వాలనుకుంది. కానీ కాంత ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. భాగ్యశ్రీ బోర్సే లుక్స్ బావున్నా కంటెంట్ ఎక్కలేదు. కాంతా పై ఈ భామ భాగ్యశ్రీ బోర్సే చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ భాగ్యశ్రీ బోర్సే ను కాంతా చిత్రం కూడా ఫుల్ గా డిజప్పాయింట్ చేసింది.
కాంత వచ్చిన రెండు వారాలకే భాగ్యశ్రీ బోర్సే హీరో రామ్ తో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా తో లక్కు పరీక్షించుకుంది. ఆంధ్ర తాలూకా కింగ్ ఈరోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆడియన్స్ హిట్ రెస్పాన్స్ రాగా.. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా సినిమాలో రామ్-భాగ్యశ్రీ బోర్సే ట్రాక్ యూత్ కి కనెక్ట్ అయ్యింది. అటు ఆంధ్ర తాలూకా కింగ్ కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది.
మరి ప్రస్తుతం బాక్సాఫీసుని షేక్ చేసే సినిమాలేవీ లేకపోవడంతో ఆంధ్ర తాలూకా కింగ్ అఖండ తాండవం వచ్చేవరకు నిలదొక్కుకోవడం ఖాయం. సో భాగ్యశ్రీ బోర్సే కి ఈ చిత్రంతో కెరీర్ లో మొదటి హిట్ అందుకున్నట్టే కనిపిస్తుంది.