బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితిష్ తివారీ దర్శకత్వంలో భారీ కాన్సాస్ పై `రామాయణం` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండవ భాగం ఆన్ సెట్స్ లో ఉంది. తొలి భాగం రిలీజ్ కు ముందే రెండవ భాగం షూటింగ్ దశలో ఉండటం విశేషం. మొదటి భాగం వచ్చే దీపావళి కానుకగా కానుకగా రిలీజ్ కానుంది.
దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. టెక్నికల్ గా సినిమా హైలైట్ కానుంది.నితీష్ తివారీ చిత్రాలంటే? ఎంత అసాధారణంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. `దంగల్` తో ఇండియన్ బాక్సా ఫీస్ వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసిన దర్శకుడు. `దంగల్` ఏకంగా 2000 కోట్ల వసూళ్లతో ఓ రికార్డు నమోదు చేసింది. ఇప్పుడా రికార్డును `రామాయణం` బ్రేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అత్యంత భారీ బట్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రమిది. వచ్చే ఏడాది రిలీజ్ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విఎఫ్ ఎక్స్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. `విజువల్స్ అద్బుతంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి ఇది ప్రామాణికంగా మారుతుంది. ఐదేళ్లగా పని చేస్తున్నామన్నారు. కొన్ని కథలు ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా ఉంటాయి. అలాంటి వాటిలో రామాయణం ముందు వరుసలో ఉంటుంది.
ప్రపంచంలోనే గొప్ప విఎఫ్ ఎక్స్ కంపెనీ ప్రైమ్ ఫోకస్ తో కలిసి పని చేస్తున్నాం. నేను ఇంత పెద్ద సినిమా చేస్తున్నానని నమ్మడానికి రెండేళ్లు సమయం పట్టింది. వచ్చే ఏడాది ఈ సమయానికి మొదటి భాగం ఫలితం తెలిసిపోతుందన్నారు. కానీ రిలీజ్ సమయం దగ్గర పడేసరికి కాస్త టెన్షన్ గానూ ఉందన్నారు.