నందమూరి నటసింహ బాలకృష్ణ అలుపెరగని విజయాలతో సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. అఖండ మొదలుకుని వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ విజయాలతో ఉన్న బాలయ్య బోయపాటి తో హ్యాట్రిక్ కొట్టి నాలుగో విజయానికి చేరువయ్యారు. బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 తాండవాన్ని డిసెంబర్ 5 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
ఈసారి అఖండ సింహ గర్జన పాన్ ఇండియాలోని పలు భాషల్లో వినిపించబోతున్నది. సీనియర్ హీరోస్ లో క్రేజీగా మారిన నటసింహ బాలకృష్ణ అఖండ 2 కి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ పారితోషికం అందుకున్నారనే వార్త నందమూరి అభిమానులకు అమృతంలా మారింది. అఖండ-2 తాండవం సినిమా కోసం బాలయ్య ఏకంగా 45 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారట.
బాలయ్య కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ ఫిగర్ అని తెలుస్తుంది. మరి విజయాలకు కేరాఫ్ గా నిలుస్తున్న బాలయ్యకు ఎంత ఇచ్చిన తక్కువే అనే ఆలోచనలో ఆయన నిర్మాతలు కనిపిస్తున్నారు. మరోపక్క బోయపాటి కూడా ఈ అఖండ 2 కోసం కళ్ళు చెదిరే పారితోషికం అందుకుంటున్నారనే టాక్ వినబడుతుంది. అఖండ-2 కోసం బోయపాటి ఏకంగా రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
ఆయన గత చిత్రం స్కంద ప్లాప్ అయినా.. అందులోని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. అందులోను బాలయ్య-బోయపాటి కాంబో అంటే ఆ మాత్రం తీసుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.