ఆంధ్ర తాలూకా కింగ్ ఈ నెల 28 న అంటే రేపు గురువారం విడుదల కాబోతుంది. ప్రస్తుతం హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఆంధ్ర తాలూకా కింగ్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా వున్నారు. ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో ఆంధ్ర తాలూకా కింగ్ పై ఆసక్తి కనిపిస్తుంది. మరి ప్రమోషనల్ కంటెంట్ మాదిరి సినిమా లో కూడా కంటెంట్ బలంగా ఉండాలి.
ఈ చిత్ర విజయం అటు హీరో రామ్ కి ఇటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కి ఇద్దరికి కీలకమే. కచ్చితంగా ఆ ఇద్దరి కెరీర్ కి ఆంధ్ర తాలూకా కింగ్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం రామ్ చాలా కష్టపడుతున్నా అతనికి విజయం మాత్రం అందనంత దూరం పోతుంది.
మరోపక్క కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కి డిజప్పాయింట్ చేసే సినిమాలే తగిలాయి. మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్, నిన్నటికి నిన్న కాంత కూడా భాగ్యశ్రీ బోర్సే ని నిరాశపరిచింది. అందుకే ఆమెకు ఈ ఆంధ్ర తాలూకా కింగ్ హిట్ కంపల్సరీ అయ్యింది. మరి ఆంధ్ర తాలూకా కింగ్ రిజల్ట్ ఏమిటో మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే తేలిపోతుంది.