8గంటల పని నియమంపై చాలా డిబేట్ నడుస్తోంది. స్పిరిట్, కల్కి 2898 ఏడి లాంటి భారీ చిత్రాల ఆఫర్లను కోల్పోయింది దీపిక. అరుదుగా సెట్లో 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉండి పని చేయాల్సి ఉంటుంది. కానీ దానికి దీపిక ససేమిరా అన్నారు.
అయితే దీపిక డిమాండ్ చేసిన 8గంటల పని దినం రూల్ ని భారతదేశంలో అమలు చేయాలని వాదించే సెక్షన్ కూడా ఉంది. సిద్ధార్థ్ కన్నన్‌తో మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్ ఏమన్నారంటే.. వయసును బట్టి పనిగంటలు. మీరు 16 సంవత్సరాల వయస్సులో ఎలా ఉన్నారో, 25 సంవత్సరాల వయస్సులో ఎలా ఉన్నారో, 35 సంవత్సరాల వయస్సులో మీరు ఎలా ఉన్నారో కాదు. కాబట్టి ఎవరికీ ఎప్పుడూ ఒక నియమం లేదు. అమితాబ్ జీని 14 గంటలు పని చేయమని అడగగలరా? అని కూడా ప్రశ్నించింది. నా జీవితంలో ఈ దశలో, నేను నా కుటుంబానికి ఇంత సమయం ఇవ్వాలనుకుంటున్నాను లేదా ఇన్ని గంటలు పని చేయాలనుకుంటున్నాను అని నిర్ణయించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేను అంతకన్నా ఎక్కువ చేయలేకపోతే, దురదృష్టవశాత్తు వదులుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంత పని చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునే హక్కు ఉంది`` అని అన్నారు. జీవితంలోని వివిధ దశలను బట్టి ప్రాధాన్యతలు మారుతున్నందున అందరికీ ఒకే నియమం ఉండకూడదని తాను నమ్ముతున్నానని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.