నిన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కి, రష్మిక గర్ల్ ఫ్రెండ్ మూవీ కి ఆడియన్స్ నుంచే కాదు సినీ విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. తిరువీర్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కి ప్రీమియర్స్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇక సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక-గీత ఆర్ట్స్ కలయికలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ కి ముందు నుంచే అంచనాలున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రష్మిక పెరఫార్మెన్స్ , దీక్షిత్ శెట్టి నటన, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం అన్ని గర్ల్ ఫ్రెండ్ విజయంలో భాగమయ్యాయి.
అయితే గర్ల్ ఫ్రెండ్ కి విడుదలకు ముందే ప్రమోషన్స్ పెద్దగా లేవు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు, ఈ వారం ఆడియన్స్ మెచ్చిన ప్రీ వెడ్డింగ్ షో, అలాగే గర్ల్ ఫ్రెండ్ ని ఇంకా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఓ వారం పాటు థియేటర్స్ లో వర్కౌట్ అవడం పక్కా. మౌత్ టాక్ ఓకె కానీ పబ్లిసిటీ ఎక్కడా అని ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.
ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినా.. ఈ రెండు సినిమాలు మెల్లగా పికప్ అవడం చూస్తే నిర్మాతలు కాస్త బెటర్ గా ఈ సినిమాలను జనాల్లో తీసుకెళ్లగలిగితే లాభాలు తెచ్చుకోవచ్చు. చూద్దాం వారి ఆలోచన ఎలా ఉందొ అనేది.