Advertisement
Google Ads BL

టాక్సిక్: రా అండ్ రస్టిక్‌- రుక్మిణి వసంత్


ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేసి, అంతర్జాతీయ స్థాయిలో మన సత్తాను చాటేందుకు రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశ బెంగళూరులో జరుగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న చిత్రాల్లో ఆడియెన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ల్లో టాక్సిక్ ఒకటిగా నిలుస్తుంది.

Advertisement
CJ Advs

క్రేజీ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో జరిగిన చిట్ చాట్‌లో టాక్సిక్ గురించి ఆమె ప్రస్థావించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల రుక్మిణి వసంత్ తన ఉత్సాహాంగా ఉన్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ఆమె మాటల్లో చెప్పాలంటే.. టాక్సిక్ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో అద్భుతంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే.. అదే సమయంలో ఎంతో హృద్యంగానూ ఉంటుంది అంటూ రుక్మిణి చెప్పిన మాటలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

Rukmini Vasanth says Toxic: A Fairytale for Grown-ups:

Rukmini Vasanth says Toxic: A Fairytale for Grown-ups is unlike anything Indian cinema has seen so far
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs