మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు రామ్ చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. పెద్ది ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. కొండల మధ్య నివసించే హీరో, ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఉప్పొంగే భావోద్వేగం సంగీతంగా, సంబరంగా వెలువడుతుందని సందర్భాన్ని వివరించారు.
హీరో అమ్మాయిని చికిరి అని పిలుచుకోవడం ఈ పాటకు ప్రాణం అయింది. రెహమాన్ సృష్టించిన హై వోల్టేజ్ బీట్‌లకు అనుగుణంగా రామ్ చరణ్ తన సిగ్నేచర్ మాస్ డాన్స్ స్టైల్, ఎనర్జీ తో అదరగొట్టారు. ఈ పాటలో చరణ్ హుక్‌స్టెప్ క్షణాల్లో వైరల్ అయ్యింది.
నవంబర్ 7న విడుదల కాబోతున్న చికిరి చికిరి లిరికల్ వీడియో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కాన్సెప్ట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెరిపోయింది. రెహమాన్ సంగీతం, చరణ్ స్టెప్స్, బుచ్చిబాబు మార్క్ తో ఈ ఆల్బమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, చరణ్ ప్రేమికురాలు చికిరిగా కనిపించనుంది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.