బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు టాప్ 5 లో ఉంటారు, ఎవరు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది అనే విషయంలో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు, లోపలి హౌస్ మేట్స్, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా పక్కా క్లారిటీతో కనిపిస్తున్నారు. సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంటర్టైనర్ గా, అలాగే టాస్క్ విషయంలో ఎక్కడా తగ్గకుండా, సంజన కోసం కెప్టెన్సీ నే త్యాగం చేసిన ఇమ్మాన్యువల్ ఈసారి టైటిల్ ఫెవరేట్ అంటున్నారు.
ఎలిమినేట్ అయిన ప్రతిఒక్కరూ టాప్ 1 లో ఎవరు ఉంటారని అడిగితే తడుముకోకుండా ఇమ్మాన్యువల్ పేరు చెబుతున్నారు. మొదటి రెండు మూడు వారాల్లో భరణి టైటిల్ ఫెవరేట్ గా కనిపించినా.. ఇమ్మాన్యువల్ క్రమంగా ఆడియన్స్ మనసులలోకి వెళ్ళిపోయాడు. ఎవరితో గొడవ పడడు, అలాగని కామ్ గా ఉండడు, టాస్క్ ల్లో దుమ్మురేపుతాడు. భరణిని మళ్లీ హౌస్ లో ఎంటర్ అవడానికి ఇమ్మాన్యువల్ కారణం.
ఇక మిగతా హౌస్ మేట్స్ తో ర్యాపొ మైంటైన్ చేస్తాడు. అవకాశం ఉన్నపుడల్లా కామెడీతో నవ్విస్తాడు, తనూజ తో సరదాగా కనిపిస్తాడు. అదే అతన్ని సీజన్ 9 టైటిల్ ఫేవరేట్ ని చేసింది అంటున్నారు. మరి టాప్ 5 లో కచ్చితంగా ఇమాన్యువల్ ఉంటాడు అది పక్కా.. టైటిల్ విన్నర్ కూడా అతనేనా అనేది ఇంకాస్త వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది.