టిల్లు సీరీస్ తో క్రేజీగా వచ్చి యూత్ కి దగ్గరైన హీరో సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో సిద్దు మ్యానరిజానికి యూత్ కనెక్ట్ అయ్యారు. దానితో క్రేజీగా మారిన సిద్దు జొన్నలగడ్డ టిల్లు తర్వాత జాక్ తో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయారు. జాక్ తో అట్టర్ ప్లాప్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ తదుపరి డెబ్యూ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు.
కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి సిద్దు హీరోగా తెలుసు కదా చిత్రాన్ని తెరకెక్కించింది. తెలుసు కదా దివాళి స్పెషల్ గా విడుదలై జస్ట్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తెలుసు కదా చిత్రం పూర్తిగా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. తెలుసు కదా రిజల్ట్ అటు సిద్దు జొన్నలగడ్డ ను, ఇటు ఆయన ఫ్యాన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసింది.
థియేటర్స్ లో సో సో గా ఆడిన తెలుసు కదా చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. అయితే ఐదు వారాల డీల్ తో తెలుసు కదా ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో నిరాశపరచడంతో నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ చూస్తుందట.
అంటే నవంబర్ 13 నుంచే తెలుసు కదా ను స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.