బిగ్ బాస్ సీజన్ 9 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇంటికి వెళుతున్నారు, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, ఎలిమినేటెడ్ సభ్యులు మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎప్పుడు రచ్చ రచ్చ ఉండేలా బిగ్ బాస్ చూసుకుంటున్నారు.
ఇక ఈ తొమ్మిది వారాల గేమ్ లో ఎవరు టాప్ 5 కి వెళతారు, ఎవరు టాప్ 3 లో ఉంటారు అనేది చాలామందికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పటివరకు నామినేషన్స్ లోకి రాని ఇమ్మాన్యువల్ సెటిల్ గేమ్ ఆడుతున్నా, అతను కొన్ని విషయాల్లో బ్లేమ్ అవుతున్నాడు. సేఫ్ గేమ్ అంటూ నాగార్జునే ఇమ్మాన్యువల్ బలుపు దించేశారు. అయినప్పటికి ఇమ్మాన్యువల్ గేమ్ అతన్ని టాప్ 3 లో ఉంచడం ఖాయం.
ఇక నామినేషన్స్ లోకి రాగానే ఆడియన్స్ సపోర్ట్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది లేడీ కంటెస్టెంట్ తనూజ. అంతేకాదు హౌస్ లోను ఆమె నవ్వు, ఆమె మాట తీరుకి అందరూ ఫిదా అవడం తనూజ ను టాప్ 3 లో ఉంచేలా కనిపిస్తుంది. ఇక సుమన్ శెట్టి కూడా చాలా బాగా హౌస్ లో కనిపిస్తున్నాడు. అతని ఆట, సుమన్ శెట్టి కామెడీ, అతను స్టాండ్ తీసుకునే తీరు సుమన్ శెట్టి ని టాప్ 3 కి పంపిస్తుంది.
ఎవరు నామినేట్ చేసినా సుమన్ శెట్టి కి ఆడియన్స్ సపోర్ట్ బాగా కనిపిస్తుంది. అటు తనూజ ను ఎవరు టార్గెట్ చేసినా అది తనూజ కి ప్లస్ అవుతుంది తప్ప ఆమెకు డ్యామేజ్ కావడం లేదు. ప్రస్తుతం సీజన్ 9 లో టాప్ కి ఇమ్మాన్యువల్, తనూజ, సుమన్ శెట్టి వెళ్లడం ఫిక్స్ అనే కామెంట్స్ వినబడుతున్నాయి.