బిగ్ బాస్ సీజన్ 9 లో కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన రీతూ చౌదరి.. టాప్ 5 లోకి వెళుతుంది అనుకున్నారు. టాస్క్ ల్లో సూపర్ గా ఆడుతుంది, నామినేషన్స్ లో స్టాండ్ తీసుకుంటుంది. ఎవరికైనా కరెక్ట్ గా సమాధానమిస్తుంది. కానీ ఇప్పుడు ఈఅమ్మాయి టాప్ 5 లో ఉంటుంది అనేది అనుమానమే.
కారణం రీతూ చౌదరిలో ఉన్న మైనస్. అదే ఆమె డిమోన్ పవన్ తో చేస్తున్న ఫ్రెండ్ షిప్. రీతూ చౌదరి లవ్ ట్రాక్ వేసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వొచ్చని అనుకుందో, లేదంటే వేరే ఏమైనా ప్లాన్ ఉందొ తెలియదు కానీ.. ఆమె పవన్ తో చేస్తున్న ఫ్రెండ్ షిప్ ఎవ్వరికి నచ్చడం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రీతూ చౌదరిని పవన్ ఫ్రెండ్ షిప్ వల్లే నామినేట్ చేస్తున్నారు.
రీతూ చౌదరి కూడా ఎక్కడో ఒకచోట పవన్ దగ్గర ఆగిపోతుంది. పవన్ కూడా రీతూ విషయంలో చాలా పొలైట్ గా అంటే ఆమెని ఉపయోగించుకుంటున్నాడు కానీ.. ఆమెతో ప్యూర్ గా ఉండడం లేదు. అయినా రీతూ పవన్ చుట్టూ తిరుగుతుంది. అదే ఆమె ఆటను డౌన్ చేస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండాల్సిన రీతూ చౌదరి పవన్ దగ్గరకొచ్చేసరికి వీక్ అవుతుంది. అదే ఆమెకున్న అతిపెద్ద మైనస్.