పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన దే కాల్ హిమ్ OG . సెప్టెంబర్ 25 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం థియేటర్స్ లో ఆహా ఓహో అన్నారు. చాలామంది పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత లుక్ విషయంలో అద్భుతం అన్నారు. కొంతమంది OG కి బ్రేక్ అవ్వలేదు, నిర్మాత దానయ్య మరో సినిమా తీసి రిస్క్ చెయ్యలేక ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు, ఆయన ఎవ్వరి ఫోన్ కి రెస్పాండ్ అవ్వడం లేదు అన్నారు.
కానీ OG థియేటర్స్ లో ఎలా ఉన్నా ఓటీటీ లో దుమ్ములేపుతుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అక్టోబర్ 23 నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. కొన్ని దేశాల ఆడియన్స్ OG ని ఇంట్రెస్టింగ్ గా వీక్షిస్తున్నారు, ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ను లైక్ చేస్తున్నారు.
మరి ఈ క్రేజీ మూవీ OG ని ఓటీటీలో ఓ రెండు చిత్రాలు టచ్ చేయగలవా, ఈ వారం వివిధ రకాల ఓటీటీలలోకి రాబోతున్న థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార చాప్టర్ 1, మలయాళ మూవీ కొత్త లోక చిత్రాలు OG క్రేజ్ ని టచ్ చేయగలవా అంటూ పవన్ ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు. చూద్దాం కాంతార 1, లోక చిత్రాల ఓటీటీ పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది.