అవును హైదరాబాద్ లో నారా రోహిత్ పెళ్లి.. రేపు అక్టోబర్ 30 రాత్రి 10.30 హీరో నారా రోహిత్ వివాహం శిరీష లెల్ల తో జరగబోతుంది. మరి తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు వివాహం అంటే ఏపీ సీఎం చంద్రబాబు కచ్చితంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పెళ్లి కోసం హైదరాబాద్ వస్తే అక్కడ ఏపీ మొంథా తుఫాన్ తో అల్లాడిపోతోంది. అందుకే ఆయన దుబాయ్ నుంచి రాగానే తమ్ముడు కొడుకు నారా రోహిత్ పెళ్లి సెలెబ్రేషన్స్ లో పాల్గొనకుండాహైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లిపోయారు.
అక్కడ ఏపీ ని వణికిస్తున్న మొంథా తుఫాన్ పై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఏపీలో మొంథా తుఫాన్ భీబత్సం అంతా ఇంతా కాదు. నిన్నరాత్రి తుఫాను తీరం దాటే సమయంలో సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా, ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురు గాలులకు చెట్లు పడిపోవడం ఇలా ఈ భీబత్సాన్ని చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే చెయ్యనున్నారు.
ఏపీలో పరిస్థితి చక్కబడితే చంద్రబాబు నారా రోహిత్ వివాహానికి హాజరవుతారు. నారా రోహిత్-శిరీష ల వివాహం వేడుకలను నారా భువనేశ్వరి చూసుకుంటున్నారు. ప్రస్తుతం మినిస్టర్ లోకేష్ కూడా ఏపీలోనే ఉన్నారు. మొంథా తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఆయన నిరంతరం పని చేస్తున్నారు. సో ఇక్కడ పెళ్లి అక్కడ మొంథా తుఫాన్ తో చంద్రబాబు నాయుడు పెళ్ళికి వచ్చేందుకు వాతావరణం అనుకూలిస్తుందో లేదో చూడాలి.