TFJA నూతన అధ్యక్షుడిగా వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు.
తెలుగు సినిమా జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా పని చేస్తున్న సంస్థ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA).
ఇందులో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న 221 మంది సభ్యులుగా ఉన్నారు.
తాజాగా టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) నూతన అధ్యక్షుడిగా వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు, కోశాధికారిగా నాయుడు సురేందర్, ఉపాధ్యక్షులుగా జె. అమర్ వంశీ, వి. ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శులుగా జీవి, సురేష్ కొండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వై. రవిచంద్ర, ఎం. చంద్రశేఖర్, ఫణి కందుకూరి, డా చల్లా భాగ్యలక్ష్మి, బి. వేణు, శివ మల్లాల, రాంబాబు పర్వతనేని, దీపక్ కోడెల, కె. సతీష్, శ్రీను దుడ్డి, సత్య పులగం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమితులు అయ్యారు.
ప్రతి ఏడాది హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటివి అందిస్తున్నారు.
అసోసియేషన్ సభ్యులతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతోంది.
వై.జె. రాంబాబు నాయకత్వంలోని నూతన కార్యవర్గం TFJA సభ్యుల కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని వివరించింది.
ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని తెలిపింది.
మీ సలహాలు, సూచనలకు ఈ మెయిల్ ఐడి, ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.