Advertisement
Google Ads BL

సిస్టా›్ల ఇంటర్నేషనల్‌ ప్రీ స్కూల్‌ ఓపెనింగ్


దీపావళి శుభ సందర్భంగా మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ సమీపంలో సిస్టా ఇంటర్నేషనల్‌ ప్రీ స్కూల్‌ ను ఎంతో ఘనంగా అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభించారు. అలీ, బ్రహ్మానందం, శివాజీ, రఘుబాబు, కమెడియన్‌ ప్రవీణ్, జైల్‌ సూపరిండెంట్‌ దామర్ల కాళిదాసు, హీరోయిన్‌లు ఎస్తర్, దివిలతో పాటు ఇన్‌ఫ్లూయన్సర్‌ బెజవాడ బేబక్క (మధు), ఎక్స్‌ యంఎల్‌ఏ కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆనందలహరి వెబ్‌ సిరీస్‌ ఫేం హీరో అభిషేక్‌ బొడ్డేపల్లి, దర్శకుడు సాయి వానపల్లి  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

అలీ సిస్టా›్లస్కూల్‌ చైర్మెన్‌ లోహిత్‌తో పాటు ఎస్తర్, బెజవాడ బేబక్క లతో కలిసి రిబ్బన్‌ కట్‌ చేసి సిస్టా›్ల ఇంటర్నేషనల్‌ ప్రీ స్కూల్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటులు అలీ మాట్లాడుతూ– ఈ స్కూల్‌ను చూస్తుంటే మళ్లీ చిన్నప్పటిలా లాగు చొక్కా వేసుకుని స్కూల్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. నాకు చదువంటే ఎంతో గౌరవం. అందుకే ఎంతో కష్టపడి ఆరు భాషలు మాట్లాడటం నేర్చుకున్నా అన్నారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– మణికొండ లాంటి ఏరియాలో ఇలాంటి స్కూల్‌ ఏర్పాటు చేసినందుకు లోహిత్‌ను ఎంతగానో అభినందిస్తున్నా. చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తే వారి జీవితానికి పునాది అవుతుంది అన్నారు. శివాజి మాట్లాడుతూ – నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ^è దువు అయిపోయిన తర్వాత ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండేది అనుకున్నా. 

అందుకే నా పిల్లలకు ఒక్కటే చెప్పాను. నేను సంపాదించి మీకేం ఇస్తానో నాకు తెలియదు కానీ మీరు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అని చెప్పాను. అందుకే పిల్లలు బాగా చదువుకోవాలని పెట్టిన సిస్టా›్ల స్కూల్‌ యాజమాన్యానికి ముఖ్యంగా లోహిత్‌కి అభినందనలు’’ అన్నారు. 

సిస్టా›్ల స్కూల్‌ ఫౌండర్‌  చైర్మెన్‌ లోహిత్‌ మాట్లాడుతూ– ఇంతమంది పెద్ద నటీనటులు , రాజకీయ నాయకులు, మీడియా పెద్దలు వచ్చి మా స్కూల్‌ని ప్రారంభించారు. మీ అందరి అభిమానంతో ఇలాంటి స్కూల్స్‌ మరో 50 వరకు పెడతాను అన్నారు.

Sistla International School Opening:

Celebrities Launch Sistla International School
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs