Advertisement
Google Ads BL

మోడీ పర్యటనపై వైసీపీ పైత్యం


ఈరోజు గురువారం ప్రధాని మోడీ ఏపీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాదు శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని సందర్శించుకుని కర్నూల్ లో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కర్నూలు కి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన మోడీని సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్ లు సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. 

Advertisement
CJ Advs

మోడీ తో లోకేష్ చేయి కలిపి మట్లాడడం, లోకేష్ వెయిట్ తగ్గిన విషయం మోడీ ప్రత్యేకంగా మాట్లాడడం, నారా లోకేష్ తో మోడీ చేయి కలుపుతూ సరదాగా ఉండడం ఇవన్నీ వైసీపీ నేతలకు అస్సలు రుచించలేదు. దానితో మోడీ పర్యటన, చంద్రబాబు, పవన్, లోకేష్ లు ప్రధానికి సరిగ్గా ఆహ్వానం పలకలేదు అంటూ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. 

అంతేకాకుండా ఎటువంటి వినతి పత్రం ఇవ్వకుండానే మెడికల్ కాలేజీలు, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని ప్రధాని మోడీకి వైసీపీ వినతి పత్రం ఇచ్చినట్టు, ప్రధానిని కోరినట్టు అసత్య ప్రచారం స్టార్ట్ చేసారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష పార్టీ ను ఆహ్వానించని వైకాపా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం వైకాపా ప్రజా ప్రతినిధులకు సైతం ఎప్పటికప్పుడు ఆహ్వానం పంపినా వారు హాజరవలేదు.  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకి అతీతంగా ప్రోటోకాల్ పాటించి ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇచ్చారు. 

కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోని వైకాపా ప్రజా ప్రతినిధులు.. ప్రధాని కార్యక్రమాన్ని సైతం తమ ఫేక్ ప్రచారానికి వాడుకోవడం విస్మయానికి గురి చేస్తుంది. అటు ప్రధాని మోడీకి వినతిపత్రాలు ఇచ్చామనే ఫేక్ ప్రచారం పై కేంద్రం ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది. 

PM Modi - YSRP:

YSRCP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs