ఏపీలో నకిలీ మద్యం కేసులో ప్రధాన్ నిందుతుడు జనార్దన్ రావు బయటపెట్టిన నిజాలు.. వైస్సార్సీపీ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఈ నకిలీ మద్యం కేసు ని టీడీపీ పై రుద్దాలని వైసీపీ నేత జోగి రమేష్ జనార్దన్ రావుతో చేసిన కుట్రను జనార్దన్ రావు బయటపెట్టేసాడు. A 1నిందితుడుగా దొరికిన జనార్దన్ రావు వైసీపీ నేత జోగి రమేష్ కుట్రలను తేటతెల్లం చేసాడు.
మొదటినుంచి ఈ కేసుని టీడీపీ కి అంటగట్టాలని వైసీపీ పార్టీ చాలా ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు ఈకేసులో వైస్సార్సీపీ నే అడ్డంగా ఇరుక్కుని.. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక గిలగిలకొట్టేసుకుంటుంది. జోగి రమేష్ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పావులు కదుపుతూ సమయం రాగానే విషాన్ని చిమ్మడం దగ్గరనుంచి తనతో చేయించిన దారుణాలను మొత్తాన్ని జనార్దన్ రావు బయటపెట్టాడు.
జనార్దన్ రావుతో జోగి రమేష్ వాట్సాప్ చాట్ లు, మెసేజెస్ బయటకు రావడంతో నిన్నటివరకు రాద్ధాంతం చేసిన వైస్సార్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు తెలు కుట్టిన దొంగల్లా కామ్ అవడమే కాకుండా, తమ పార్టీకి బురద అంటకుండా ఉండేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ వ్యవహారాన్ని ఎలా దారిమళ్లించాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు.
ఎలాగైనా టీడీపీ ని ఇరుకున పెట్టాలని శతవిధాలుగా ట్రై చేసి చివరికి వారి కుట్రల్లో వారే అడ్డంగా ఇరుక్కోవడం చూసిన వారు వైసీపీ పార్టీ ఇంత దారుణంగా తయారయ్యిందేమిటి అని మాట్లాడుకుంటున్నారు.