Advertisement
Google Ads BL

నకిలీ మద్యం కేసులో షాకింగ్ వీడియో


కొద్దిరోజులుగా ఏపీలో నకిలీ మద్యం కేసు విషయం ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో.. ఇది తెలుగు దేశం నేతలే చేసారు అని నిరూపించడానికి వైసీపీ బ్లూ మీడియా, సాక్షి ఛానల్ లు ఎంతగా ట్రై చేస్తున్నాయో చూస్తున్నారు. తాజాగా నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు బయట పెట్టాడు.  

Advertisement
CJ Advs

తాను వైసిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు జనార్ధన్ రావు అంగీకరించాడు. అయితే గత ఏడాది కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేసాము అని చెప్పడమే కాదు మరోసారి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని జనార్ధన్ రావు చెప్పడం చూసి ఏపీ ప్రజలు నిర్ఘాంతపోయారు. 

ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేసి బ్రష్టు పట్టించడానికి మళ్ళీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాకు ఫోన్ చేసారు అంటూ జనార్దన్ రావు చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. ముందుగా ఇబ్రహీంపట్నం లో పెట్టాలి అనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యాన్ని తయారీ మొదలుపెట్టాం

తంబళ్లపల్లె నియోజకవర్గం లో లిక్కర్ షాపులు నేను తీసుకున్నా. తంబళ్లపల్లె నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం పై బురద జల్లొచ్చు అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ నాతో అన్నారు. వేరే వాళ్ళ పేరు మీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకొచ్చాం. ముందుగా లిక్కర్ తయారీ చెయ్యండి. సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో చెప్పారు. నాకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులు నుండి బయటపడటానికి సహాయం చేస్తామని జోగి రమేష్ నాకు హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యిన తరువాత నన్ను ఆఫ్రికా లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు పంపారు. 

అనుకున్న ప్లాన్ ప్రకారమే జోగి రమేష్ తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్ కు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. ఆ రైడ్ ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేసారు. మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నం లో కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నారు.  

ఇబ్రహీంపట్నం గోడౌన్ లో ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారు . మళ్ళీ జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. అనుకున్నది అంతా జరిగింది చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది అంతా బాగా జరిగింది నువ్వు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ నాతో అన్నారు . అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చి ఇప్పుడు జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు. నన్ను మాత్రమే కాదు నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించాడు. 

నీ ఫ్రెండ్ జై చంద్రారెడ్డి ఎలాగో ఆఫ్రికా వ్యాపారాలు చేసుకుంటున్నాడు అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదు అని జోగి రమేష్ నన్ను నమ్మించాడు. అసలు జై చంద్రారెడ్డి కి జరిగిన దానికి సంబంధం లేదు. జోగి రమేష్ తో నాకు చిన్నప్పటినుండి పరిచయం,  నన్ను నమ్మించి జోగి రమేష్ మోసం చెయ్యడం తో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అంటూ సంచలన విషయాలు జనార్ధన్ రావు బయటపెట్టారు. 

AP Adulterated Liquor Case:

AP 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs