Advertisement
Google Ads BL

BB 9: కంటెస్టెంట్స్ పై నాగార్జున ఫైర్


బిగ్ బాస్ సీజన్ 9 మెల్లగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సీజన్ 9 మొదలై ఐదు వారాలు పూర్తవుతున్న సమయంలో ఫైర్ స్ట్రోమ్ అంటూ వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఈ వారం హౌస్ లోకి ఎంటర్ కాబోతున్నాయి. ఇకపోతే ఈవారం టాస్క్ ల్లో కంటెస్టెంట్స్ బిహేవియర్ పై హోస్ట్ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో ఫైర్ అయ్యారు.

Advertisement
CJ Advs

భరణి, తనూజ, దివ్య  లపై నాగార్జున ఫైర్ అయిన ప్రోమో తో పాటుగా మరో ప్రోమో వదిలారు. అందులో సుమన్ శెట్టి వాటర్ టాస్క్ లో ఎలిమినేట్ అవడం, ఫ్లోరా షైని, రాములు సరిగ్గా చూడకపోవడం పై నాగార్జున వీడియో వేసి చూపించారు. ఆడియన్స్ కూడా సుమన్ శెట్టి అవుట్ అవ్వలేదు అన్నారు.

ఆతర్వాత రీతూ-డిమోన్ పవన్ లను లేపి నాగార్జున ఎడా పెడా క్లాస్ పీకారు. రీతూ ఒక్క గ్లాస్ పెట్టకపోతే ఆమెను ఎన్ని మాటలన్నావ్, మొహం మాడ్చుకుని మూల కూర్చుని రీతూ ని అందరి దగ్గర మాట్లాడావ్, దానితో రీతూ ఫీల్ అయ్యింది అన్న నాగార్జున.. రీతూ బెలూన్ టాస్క్ ఆడిన విధాన్ని నాగ్ తప్పుబట్టారు. ఈ వారం శనివారం ఎపిసోడ్ ఘరమ్ ఘరమ్ గా ఉండబోతుంది అని ఈ ప్రోమోస్ చూస్తే తెలుస్తుంది.

ఇక హౌస్ లో పవర్ అస్త్ర అంటూ నాగార్జున ఈవారం ఆట ఎలా ఉండబోతుందో అనేది ఈ  ప్రోమో లో హింట్ ఇచ్చారు. 

BB9- Nagarjuna fires on contestants:

<p class="MsoNormal">BB9- Nagarjuna reprimanded the contestants
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs