Advertisement
Google Ads BL

అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం


శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి  చిత్రం షూటింగ్ విజయదశమి రోజు  హైద్రాబాద్ లో నిరాడంబరంగా ప్రారంభమయ్యింది. 

Advertisement
CJ Advs

ఫిలింనగర్ లోని సంస్థ కార్యాలయంలో దేవుడి పై తీసిన ముహూర్తపు షాట్ కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, హీరో అభిరామ్ క్లాప్ ఇచ్చారు, సినిమా స్క్రిప్టును సమర్పకురాలు ఎన్. ఆర్. అనురాధాదేవి అందించారు. 

పూజ కార్యక్రమాన్ని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు నిర్వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దీపావళి తరువాత మొదలవుతుందని నిర్మాత అభిరామ్ రెడ్డి దాసరి చెప్పారు. 

ఈ సినిమా లవ్, థ్రిల్లర్ గా రూపొందుతుందని, ఈ తరానికి నచ్చే కథ తో నిర్మిస్తున్నామని, త్వరలోనే మిగతా నటీనటులను  ఎంపిక చేస్తామని చెప్పారు. 

ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  అభిరామ్ రెడ్డి దాసరి, ఛాయాగ్రహణం: విజయ భాస్కర్ సద్దాల, సహ దర్శకుడు: సాయి, సంగీతం: మంత్ర ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నారాయణ రాజు ఎస్. బి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత: అభిరామ్ రెడ్డి దాసరి. 

ఇంకా పేరు నిర్ణయించని ఈ ప్రేమ కథా చిత్రాన్ని సీనియర్ నిర్మాత శ్రీమతి అనురాధా దేవి సమర్పిస్తున్నారు.

Hero Abhiram film presented by Anuradha:

Love, a thriller film starring Abhiram as the hero has started shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs