Advertisement
Google Ads BL

OG కథ అకిరా కు అంత నచ్చింది -పవన్


నిన్న బుధవారం నైట్ OG సక్సెస్ సెలెబ్రేషన్స్ ను మేకర్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ OG లుక్ లోనే హాజరయ్యారు. థమన్, సుజిత్ లు పవన్ ను కత్తి తిప్పుతూ రమ్మన్నా పవన్ నవ్వుతూ వాళ్లకు అదంతా బాగోదని సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ఇక ఈ  ఈవెంట్ లో పవన్ మట్లాడుతూ.. 

Advertisement
CJ Advs

ముందుగా ఇక్కడకి వచ్చిన మీడియా వాళ్ళకి, అభిమానులకి, స్నేహితులకి, సోదర సోదరీమణులు అందరికీ ఓజీ యూనిట్ తరుపున నా హృదయపూర్వక నమస్కారాలు. ఓజీ సినిమా అనేది మా అందరికి చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, గ్రేట్ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ, ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఒక సినిమా సుజిత్ గారు ద్వారా నాకు రావడం. దానికి తమన్ జీవం పోయడం ఈ సినిమా గొప్పగా రావడానికి కారణమైన అందరికీ కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు

అసలు ఇప్పటి వరుకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్ గారు నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది. అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్ లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్ ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనంద పడుతూ ఉండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యే కథే ఓజీ సినిమా అని. 

కొన్ని సార్లు సుజిత్ లో నన్ను నేను చూసుకుంటా. ఎందుకు అంటే కొన్ని సార్లు మనం చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోవచ్చు, కానీ చేసి చూపించగలం అని నేను బాగా నమ్ముతా. అది సుజిత్ లో నాకు కనిపించింది. అందుకే సుజిత్ కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నాం అని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది. 

కాబట్టి నాకు ఉన్న సమయం లో ఓజి యూనివర్స్ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది. అలాగే అర్జున్ దాస్ అతనిని చూసినపుడు నేను చాలా ఫీల్ అవుతాను అలాంటి గొంతు నాకు లేదు అని. ఓజీ యూనివర్స్ లో భాగం అయిన ప్రతి ఒకరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ముగించారు. 

Pawan Kalyan speech at OG success celebrations :

OG success celebrations highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs