మాస్ మహారాజ్ మాస్ జతర ఎప్పుడో ఆగష్టు లో వినాయక చవితి కి విడుదల కావాల్సి ఉండగా.. అప్పుడు మాస్ జాతర చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి కొత్త డేట్ ని తాజాగా అనౌన్స్ చేసారు. మాస్ జాతర అక్టోబర్ 31, 2025న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను తీసుకురాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, వినోదాల విందుకి హామీ ఇచ్చింది.
కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని సరదాగా ఎగతాళి చేయగా.. ఆలస్యానికి గల కారణాలపై రవితేజ అంతే చమత్కారంగా స్పందించారు.
మాస్ మహారాజా రవితేజ అంటేనే సందడి. ఒకప్పటి మాస్ మహారాజాను గుర్తుచేస్తూ.. సినిమా యొక్క ఆహ్లాదకరమైన మరియు వినోదాత్మక శైలిని చూపిస్తూ ఈ వీడియో ఎంతో ఉత్సాహభరితంగా సాగింది.