Advertisement
Google Ads BL

మటన్ సూప్ టీజర్ బాగుంది - అనిల్ రావిపూడి


క్రేజీ టైటిల్, డిఫరెంట్ స్టోరీతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం మటన్ సూప్. విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం (అక్టోబర్ 1) నాడు మటన్ సూప్ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను లాంఛ్ చేసిన అనంతరం 

Advertisement
CJ Advs

అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. మటన్ సూప్ టైటిల్ చాలా బాగుంది. టీజర్ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి అని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో మా చిత్రం రాబోతోంది. అక్టోబర్ 10న మా సినిమా రాబోతోంది. అందరూ వీక్షించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. క్రమశిక్షణకు, నిబద్దతకు మారు పేరు అయిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేశారు. ఆయన మా టీజర్‌ను లాంఛ్ చేయడం మా అదృష్టం. మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ గారు ఎంతో గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. గొప్పగా నటించిన గోవింద్, జెమినీ సురేష్ గార్లకు థాంక్స్. నాకు అండగా నిలిచిన సునీత అక్కకి థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నిర్మాతలు రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. మా మటన్ సూప్ టీజర్‌ను విడుదల చేసిన అనీల్ రావిపూడి గారికి థాంక్స్. ట్రెండ్‌కు తగ్గ కథ. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు రామచంద్ర సినిమాను చక్కగా తెరకెక్కించారు. హీరో రమణ్, వర్షా విశ్వనాథ్, జెమినీ సురేష్ సహా అందరి పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది. సినిమాను అక్టోబర్ 10న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 

హీరో రమణ్ మాట్లాడుతూ .. మటన్ సూప్ టీజర్‌ను లాంచ్ చేసిన గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మా దర్శక, నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ మూవీని రూపొందించారు. టీజర్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అక్టోబర్ 10న రాబోతోన్న మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ .. మటన్ సూప్ టీజర్‌ను లాంఛ్ చేసిన గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మా చిత్రం అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ వీక్షించి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ .. మటన్ సూప్ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఇందులో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నటుడు గోవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. మటన్ సూప్ టీజర్‌ను లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. మా డైరెక్టర్ చంద్ర గారికి, నిర్మాతలకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Mutton Soup Teaser is Impressive:

Mutton Soup Teaser is Impressive-Anil Ravipudi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs