పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఓజీ చిత్రం నుండి విడుదలైన ఓమి గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓజీ చిత్ర బృందం, ఓమి ట్రాన్స్ యొక్క పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. ఓజీ, ఓమిల ముఖాముఖి పోరుని సూచించేలా ఈ సాంగ్ ఉంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మి మధ్య భీకర పోరాటం చూసేందుకు వెయిట్ చెయ్యాలి.
ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్ తో సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ ఎంతో శక్తివంతంగా ఉండి, నిజంగానే మ్యూజిక్ లవర్స్ ను ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ రాగా, తాజాగా విడుదలైన ఈ సాంగ్ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా సినిమాపై అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఉంది.
ఓజీ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఓజీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.