సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతొ అనంతపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసారు కూటమి నేతలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి మంత్రులు, కార్యకర్తలు ఇలా అనంతపురం సూపర్ సిక్స్-సూపర్ హిట్ గ్రాండ్ గా జరుగుతుంది. ఈ సభకు నారా లోకేష్ వెళ్ళలేదు. నేపాల్ లో ఇరుక్కున్న తెలుగు వారి కోసం లోకేష్ ఈ సభకు వెళ్లకుండా ఆగిపోయారు.
ఇక సభలో ముందుగా కూటమి సభ్యుల్లో బిజెపి నేత మాధవ్ ప్రసంగించారు, ఆతర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూపర్ సిక్స్-సూపర్ హిట్ పై మాట్లాడారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మట్లాడుతూ..
•అందరికీ నమస్కారం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ స్వాగతం. 15 నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది.
•నేటి ఈ సభకు కారణమైన స్త్రీశక్తికి వందనం, యువత పోరాటాలకు వందనం, అండగా నిలిచిన అన్నదాతకు వందనం....ప్రతి తల్లికీ వందనం.....కార్యకర్తల కష్టానికి, త్యాగానికి వందనం.
•ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా, కసిగా ఉన్నారో నేడు అలాగే ఉన్నారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు, జన సైనికుల జోరు, కమల దళ ఉత్సాహం నేడు ఉరకలేస్తోంది.
•ఈ సభ రాజకీయాల కోసం కాదు. ఓట్ల కోసం కాదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు.
•బాధ్యత గల ప్రభుత్వంగా కూటమి ఇచ్చిన మాటను నెరవేర్చిందని చెప్పడానికే ఇక్కడకు వచ్చాం.
•సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం.
పేదల జీవితాలు మార్చే సూపర్ సిక్స్:
•సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరం తీర్చడం కాదు.
•సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటూ పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు తెచ్చాం.
•2023, మే నెల 28న రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం. సూపర్ సిక్స్ హామీలతో పాటు ఉమ్మడిగా కూటమి మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు కోరాం.
•2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. కనీ వినీ ఎరుగని రీతిలో 57 శాతం ఓట్ షేర్, 93 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 అసెంబ్లీ సీట్లు, 21 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాం.
•గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టివేసింది.
•రూ. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై దురాగతాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారు.
•93 కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్ తెచ్చిపెట్టారు.
•15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించి ఒక్కో అడుగు వేస్తూ రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతున్నాం.
•నిర్వీర్యమైన వ్యవస్థలను సరిదిద్ది...మాట ఇచ్చినట్లు అన్ని పథకాలు అమలు చేస్తున్నాం.
•అందులో భాగంగానే పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చే సూపర్ సిక్స్ అమలుచేశాం.
•అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి మాటనిలబెట్టుకున్నాం.
నాడు హేళన చేశారు... :
•సూపర్ సిక్స్ పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా.....సూపర్ సిక్స్ అంటే హేళన చేశారు....
•పింఛన్ల పెంపు అంటే అసాధ్యం అన్నారు...పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారు...
•మెగా డీఎస్సీ అవ్వదన్నారు... దీపం వెలగదన్నారు... ఫ్రీ బస్సు కదలదన్నారు! అవునా కాదా!
•మీరు చెప్పండి... ఇవన్నీ నిజం చేశామా లేదా...! కోట్ల మంది లబ్ది పొందారా, లేదా...!
తల్లికి వందనం : ఏ వ్యక్తి జీవితాన్ని అయినా, ఏ కుటుంబ స్థితిగతులను అయినా మార్చేది చదువు. ప్రతి పేద బిడ్డా చదవాలని ‘తల్లికి వందనం’ తీసుకువచ్చాం.
•ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా, పరిమితులు లేకుండా అందరికీ రూ. 15 వేలు చొప్పున అందించాం. 67 లక్షల మంది విద్యార్ధుల చదువులకు ఒకేసారి రూ.10 వేల కోట్లు ఇచ్చాం.
•ఇది 10 వేల కోట్ల పథకం కాదు...మీ బిడ్డల బంగారు భవిష్యత్ కు ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి.
•తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టే ‘తల్లికి వందనం’ సూపర్ హిట్...
స్త్రీ శక్తి : నాడు బాబే మీ డ్రైవర్ అన్నాను. చెప్పినట్లు గానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. నా తెలుగింటి ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం.
•ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం... ఎక్కడికైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్లి రావొచ్చు. ఇప్పటివరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్సు ఎక్కారు. రూ.200 కోట్ల మేర మహిళలకు ఆదా అయ్యింది.
•మీకు ఆర్థిక వెసులుబాటును, గౌరవాన్ని పెంచేందుకు తెచ్చిందే స్త్రీ శక్తి.
•ఫ్రీ బస్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది కాబట్టే ‘స్తీశక్తి’ సూపర్ హిట్....
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ : రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనకు అన్నంపెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చాం.
•కేంద్రంతో కలిసి ఏడాదికి 3 విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నాం. తొలి విడతగా ఇప్పటికే రూ. 7 వేలు ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశాం.
•ఆర్ధిక కష్టాలున్నా...అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్..
దీపం 2 పథకం: ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నాం.
•ఇప్పటికే రూ.1704 కోట్లు ఖర్చు చేసి... 2.45 కోట్ల రాయితీ సిలిండర్లు మహిళలకు ఇచ్చాం.
•ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే... ‘దీపం 2’ సూపర్ హిట్...
యువగళం: 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్‌లో చెప్పాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశాం.
•నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చేశాం.
•గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే.... మనం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇదీ మన GOODWILL, ఇదీ మన BRAND.
•యువత భవితకు భరోసా ఇచ్చాం కాబట్టే... ‘యువగళం’ సూపర్ హిట్...
•వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్: నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు ఐటీ ఉద్యోగిని తయారు చేశాం. దీంతో తలసరి ఆదాయం పెరిగి పేదరికం తగ్గింది. ఈసారి ప్రతీ ఇంటికో పారిశ్రామిక వేత్తను చూడాలనేది నా సంకల్పం.
•లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. ఈ లక్ష్యం సాధిస్తాం.
•ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: భారత దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం మనం ఇస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు’. ‘పేదల సేవలో’ భాగంగా ప్రతీ నెలా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం.
•ఒక్క పింఛన్ల పంపిణీకే ఇప్పటి వరకు సుమారు రూ.45 వేల కోట్లు ఖర్చు చేశాం.
•అన్నా క్యాంటీన్లు : పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. వీటి ద్వారా ఇప్పటివరకు 5.60 కోట్ల భోజనాలతో కడుపు నింపాం. ఇంతకంటే ఆనందం ఏముంది.
కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం:-
•కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రభుత్వం. అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం.
•కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలను మార్చేలా సంస్కరణలు తెస్తున్నాయి.
•GST Second generation reformsతో పన్నులు తగ్గి నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయి.
•ఎన్టిఎ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్ల మంది పేదల కొనుగోలు శక్తి పెంచుతుంది.
•ఇదే స్ఫూర్తితో యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చాం. దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయి.
•బిసి సోదరులను ఆదుకునేందుకు నేతన్నలకు విద్యుత్ రాయితీలు, మత్స్య కారులకు ఆర్థిక సాయం, మద్యం షాపుల్లో 10 శాతం కేటాయింపులు, నాయీ బ్రాహ్మణులకు జీతాలు పెంపు, సెలూన్ లకు ఉచిత విద్యుత్, సోలార్ రూఫ్ టాప్ లో ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నాం.
•అర్చకులు, ఇమామ్, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనం పెంచాం. ఎస్సీ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణను ఎవరికీ నష్టం లేకుండా పూర్తి చేశాం. ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచుతున్నాం.. అంటూ చంద్రబాబు ఇచ్చిన ఎనేర్జిటిక్ స్పీచ్ కి ప్రజలు జై జై లు పలికారు.