నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారంనాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ నటి జయసుధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ ఈవెంట్‌లోనే నందమూరి బాలకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రంలో వరదలకు అతలాకుతలం అయిన ప్రాంతాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షల ఆర్థిక విరాళాన్ని కూడా ప్రకటించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు డొనేట్ చేసిన బాలయ్య, వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది, జరిగిన నష్టం దృష్ట్యా.. ఉడత భక్తిగా 50 లక్షలు డొనేట్ చేస్తున్నా.. ఇక ముందు కూడా ఇలా నా సహకారం ఉంటుంది అంటూ బాలయ్య ప్రకటించారు.