క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి హిందీ అస్సలు కలిసి రావడమే లేదు. ఈమధ్యన మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది కానీ.. ఆమెకి ఆ సినిమా బిగ్ షాకిచ్చింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ స్టార్ ధనుష్ తో డేటింగ్ లో ఉంది అనే పుకార్లు షికార్లు చేసాయి.
కానీ మృణాల్ ఠాకూర్ ఆ పుకార్లను ఖండించింది. ధనుష్ తో తనది స్నేహమే అని, అంతకు మించి ఏమి లేదు అని, సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్స్ కి ధనుష్ తన కారణంగా కాదు వచ్చింది అజయ్ దేవగన్ సర్ తో ఫ్రెండ్ షిప్ వల్లే వచ్చారంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే మృణాల్ ఠాకూర్ అభిమానులకు మతులు పోయే ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో మృణాల్ ఠాకూర్ వేరే లెవల్ ఫొటోస్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చక్కటి డిజైనర్ వేర్ శారీ లో మృణాల్ మతులు పోగొట్టే ఫోజులు చూసి ఫిదా అవ్వాల్సిందే. మీరు కూడా మృణాల్ తాజా పిక్స్ పై ఓ లుక్ వేయండి.