కొంత మంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ముగ్గురు టాలీవుడ్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో కాస్తో కూస్తో సక్సెస్ అయింది నాగార్జున మాత్రమే. చిరంజీవి ఒక సిని మాకు..వెంకటేష్ రెండు, మూడు చిత్రాలకే పరిమితమయ్యారు. నాగార్జున మాత్రం రాంగోపాల్ వర్మ `శివ` కారణంగా అక్కడ బెస్ట్ లాంచింగ్ దొరకడంతో కొన్ని సినిమాలు చేయగలిగారు.
అయితే వీరంతా టాలీవుడ్ లో బిజీగా ఉండటంతో అప్పట్లో అక్కడ మార్కెట్ ని అంత సీరియస్ గా తీసు కోలేదు. ఆ తర్వాత తరం హీరోలైనా రామ్ చరణ్ `జంజీర్` రీమేక్ తో లాంచ్ అయ్యాడు. అదే తెలుగులో `తుఫాన్` గా రిలీజ్ అయింది. `సాహో` సినిమాతో ప్రభాస్, `వార్ 2` చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ లాంచ్ అయిన స్టార్లే . కానీ వీరెవ్వరి డెబ్యూ చిత్రాలు అక్కడ సక్సస్ అవ్వలేదు. గ్రాండియర్ గా రిలీజ్ అవ్వడం తప్ప బాక్సాఫీస్ వద్ద తేలిపోయిన చిత్రాలే.
అలా ఈ ముగ్గురు జూనియర్లు సీనయర్లకు సమం అయ్యారు. మరి బాలీవుడ్ లో శాశ్వతంగా జెండా పాతేసే హీరో ఎవరు? అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మార్కెట్ లో గట్టిగా వినిపిస్తుంది. `పుష్ప 2` తో బన్నీ హిందీ హీరోల బాక్సాఫీస్ రికార్డులు చెరిపేసిన సంగతి తెలిసిందే. ఒక్క హిందీ మార్కెట్ నుంచే 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి భాగం వసూళ్లు భారీగానే ఉన్నాయి. అలా `పుష్ప` రూపంలో బాలీవుడ్ హీరోలకు ఓ సవాల్ ఎదురైంది.
ఈ నేపథ్యంలో తెలుగు నుంచి బన్నీ స్ట్రెయిట్ హిందీ సినిమా తీస్తే? అక్కడ బజ్ మామూలుగా ఉండదు. ఓ పెద్ద హిందీ హీరోనే సినిమా చేస్తున్నట్లు ఉంటుంది. దీంతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీపై అప్పుడే చర్చ షురూ అయింది. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో చూడాలి. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాత ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా తెర కెక్కుతోంది.