పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా వెర్రెక్కిపోయి ఉన్నారో అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్లేదు. ఆయన రీమేక్స్ చేస్తేనే రెచ్చిపోయి చూసే అభిమానులు ఇప్పుడు OG అంటూ స్ట్రయిట్ మూవీతో రాబోతుండడం అభిమానులకు మరింత క్రేజ్ పెంచేలా చేసింది. OG కోసం ఫ్యాన్స్ ఎంత వెర్రిగా వెయిట్ చేస్తున్నారో అనేది రీసెంట్ గా ఓపెన్ అయిన ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది.
అంతేకాదు.. ఓజి వేర్ పేరుతో టి షర్టులు అమ్మకానికి పెడితే అభిమానులు రెచ్చిపోయి వాటిని కొనేస్తున్నారు. 1000, 15వందలు అన్నా లెక్క చెయ్యకుండా ఆ టి షర్ట్స్ ను ఎగబడి కొనేస్తున్నారు. సెప్టెంబర్ 25 న OG రాక ఖాయమైపోయింది. వీరమల్లు రిజల్ట్ ను గుర్తులేకుండా పవన్ ఫ్యాన్స్ OG పై క్రేజ్ చూపిస్తున్నారు.
OG ఓపెనింగ్స్ ని ఏ హీరో టచ్ చెయ్యని విధంగా రికార్డ్ సృష్టించాలనే కసితో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ OG ప్రమోషన్స్ లో కనిపించినా కనిపించకపోయినా పవన్ ఫ్యాన్స్ సినిమాని హిట్ చెయ్యాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. OG ఓవర్సీస్ బుకింగ్స్ ఈ రేంజ్ లో మొదలైతే.. రేపు రెండు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ చేస్తే OG విధ్వంశానికి నాంది పలికినట్లే.