అఖండ 2 అసలు సెప్టెంబర్ 25 కి వస్తుందా.. ఈ కన్ఫ్యూజన్ పై మేకర్స్ క్లారిటీ ఇస్తారా, ఇవ్వరా. వినాయక చవితి వచ్చింది, వెళ్ళింది.. అఖండ 2 కబురు లేదు. దానితో నందమూరి అభిమానుల్లో ఆందోళన కనిపిస్తుంది. అఖండ 2 ఖచ్చితంగా సెప్టెంబర్ 25 కి వస్తుంది అంటే గనక ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలి.
కాదు సెప్టెంబర్ 25 కి అఖండ 2 రాదు అంటే గనక అఖండ 2 పోస్ట్ పోన్ అని అనౌన్స్ చెయ్యాలి. కానీ వినాయక చవితి ఫెస్టివల్ కి అఖండ 2 విషయాన్ని చెప్పకుండా మేకర్స్ కామ్ గా దాటవేయడం అభిమానులను కూడా గందరగోళానికి గురవుతున్నారు, మరోపక్క అఖండ తాండవం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగానే జరుగుతున్నాయి.
కానీ విడుదల తేదీపై మాత్రం క్లారిటీ మిస్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రాన్ని అఖండ సెంటిమెంట్ త్రో డిసెంబర్ లో విడుదల చేస్తారనే ఊహాగానాలు నడుస్తూ ఉండడంతో.. ఈ వినాయక చవితికి అఖండ 2 విడుదల తేదీపై మేకర్స్ ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారని అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ అది జరగలేదు.