ఆగష్టు 14 న విడుదలైన కూలి, వార్ 2 రెండు చిత్రాలు విపరీతమైన హైప్ తో బాక్సాఫీసు వద్ద ఢీ కొట్టాయి. కూలి, వార్ 2 వేర్వేరు తేదీలకు విడుదలై ఉంటే గనక రెండు చిత్రాలు ఎంతోకొంత నష్టాలూ తప్పించుకునేవి. ఈమధ్య కాలంలో యావరేజ్ టాక్ ను కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. అదే కూలి-వార్ 2 ని డ్యామేజ్ చేసాయి.
విపరీతమైన హైప్ తో నువ్వా-నేనా అని పోటీపడిన వార్ 2, కూలి చిత్రాల్లో కూలి మొదటినుంచి వార్ 2 పై డామినేషన్ చూపించింది. కూలి టాక్ తో సంబంధం లేకుండా కూలీని చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడ్డారు. వార్ 2 కేవలం ఇద్దరి హీరోల యాక్షన్ తప్ప ఇంకేం లేదు, కూలి లో భారీ స్టార్ క్యాస్ట్ ఉంది అని ఎక్కువగా కూలి ని చూజ్ చేసుకున్నారు.
అయితే నష్టాల విషయంలో రెండు సినిమాలకు ఈక్వల్ గానే నష్టమొచ్చింది. అక్కడ వార్ 2 లో ఇద్దరి హీరోలే. ఇక్కడ కూలీలో నలుగురైదుగురు హీరోలు. సో పారితోషికాల పరంగా కూలి కి భారీగానే బడ్జెట్ ఎక్కింది. ఇప్పుడు వార్ 2, కూలి రెండు సినిమాలు సరిసమానమైన నష్టాలు కొని తెచ్చుకున్నాయి.
రెండు వారాలకే కూలి, వార్ 2 చిత్రాలు థియేటర్స్ నుంచి కనుమరుగైపోయాయి. కూలి, వార్ 2 రెండు చిత్రాలకు పోటీ లేదు కానీ.. అయినా ప్రేక్షకులు మాత్రమే ఆ సినిమాలను లైట్ తీసుకోవడంతో రెండిటికి భారీ డ్యామేజ్ జరిగిపోయింది.