మెగా డాటర్ నిహారిక తరచూ వార్తల్లో నిలిచే సెలెబ్రిటీ. మెగాస్టార్ డాటర్స్ సుష్మిత, శ్రీజ ఉన్నా వారు అంతగా మీడియా ముందుకు రారు. కానీ నాగబాబు కుమార్తె నిహారిక అటు నటిగా, ఇటు నిర్మాత గానే కాదు పర్సనల్ లైఫ్ తోనూ ఆమె సోషల్ మీడియాలో ఎక్కుగా ట్రెండ్ అయ్యింది. అంతేకాదు ఫ్రెండ్స్ తో చేరి నిహారిక చేసే రచ్చ ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంటుంది.
నిన్న వినాయక చతుర్థిని ఎంతో ట్రెడిషనల్ గా భక్తి శ్రద్దలతో చేసుకున్న నిహారిక ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు అంతే సంప్రదాయంగా తాజా శారీ లుక్ మాత్రం తెగ వైరల్ గా మారింది. వినాయక చవితికి ఇంట్లోనే గణేశుడికి పూజ చేసుకుని ట్రెడిషనల్ గా కనిపించిన మెగా డాటర్ తాజా లుక్ లోను అంతే ట్రెడిషన్ గా అద్దరగొట్టేసింది.
చీరకట్టులో లూజ్ హెయిర్ తో నిహారిక కొణిదెల కూల్ లుక్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మీరు మెగా డాటర్ న్యూ లుక్ పై ఓ కన్ను వెయ్యండి.