Advertisement
Google Ads BL

అఫీషియల్: మాస్ జాతర పోస్ట్ పోన్


రేపు వినాయకచవితి ఆగష్టు 27 న విడుదల కావాల్సిన మాస్ మహారాజా రవితేజ జాతర విడుదల వాయిదా అనే వార్తలను మేకర్స్ నిజం చేస్తూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో జరిగిన సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.

మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. 

Mass Jathara Postponed :

Mass Jathara Postponed - Makers Promise a Bigger Feast Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs