Advertisement
Google Ads BL

సీఎం తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు భేటీ


జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి గారి ని కలిసిన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు. వాటితో పాటుగా నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని,వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము.. తదితరులు ఉండగా.. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల ఉన్నారు. 

Advertisement
CJ Advs

అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ వారితో సమావేశమైన రేవంత్ రెడ్డి వారితో మట్లాడుతూ.. 

సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి 

సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా 

ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుంది..

పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి..

పరిశ్రమ లో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది..

స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం  కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం ..

తెలుగు సినిమా పరిశ్రమ  అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది..

తెలంగాణ లో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ..

పరిశ్రమ లో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను..

పరిశ్రమ లో నిర్మాతలు,కార్మికుల అంశం లో సంస్కరణలు అవసరం..

కార్మికుల విషయం లో నిర్మాతలు మానవత్వం తో వ్యవహరించాలి..

నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది..

సినీ కార్మికులను,నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది.

సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరం..

పరిశ్రమకు  ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం..

పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు…

అందరూ చట్ట పరిధి లో పని చేయాల్సిందే..

పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటా…

హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది..

తెలుగు సినిమా ల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి..

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ను ఉంచడమే నా ధ్యేయం..

Producers, Directors meet CM Revanth Reddy:

Producers, Directors hold discussions with CM Revanth Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs