హరి హర వీరమల్లు చిత్రం నుంచి తప్పుకుని దర్శకుడు క్రిష్ హీరోయిన్ అనుష్క తో తో ఘాటీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఘాటీ చిత్రం పదే పదే వాయిదా పడి ఫైనల్ గా సెప్టెంబర్ 5 న విడుదలకు రెడీ అయ్యింది. అనుష్క ఘాటీ చిత్ర ట్రైలర్ రీసెంట్ గానే విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సంపాదించింది.
హరి హర వీరమల్లు చిత్రంలో క్రిష్ తెరకెక్కించిన ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఇప్పుడు అనుష్క ఘాటీ పై అంచనాలు ఏర్పడ్డాయి. క్రిష్ మేకింగ్ స్టయిల్ కి ఓ వర్గం ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. అయితే క్రిష్ ఖచ్చితంగా అనుష్క తో ఘాటీ చిత్రంతో హిట్ కొట్టాలి. కొడితేనే ఆయనకు బాలయ్య తో సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
నందమూరి నటసింహ తో గౌతమి పుత్ర శాతకర్ణి, అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు చిత్రాలను తెరకెక్కించిన క్రిష్ ఇప్పుడు బాలయ్య తో ఆదిత్య 369 సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారు. అఫీషియల్ అనౌన్సమెంట్ లేకపోయినా బాలయ్యతో క్రిష్ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్. అది ఘాటీ హిట్ అయితే వెంటనే ఈప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.
ఘాటీ టాక్ తేడా వస్తే బాలకృష్ణ క్రిష్ ను పక్కన పెడతారని కొంతమంది నందమూరి అభిమానులే మాట్లాడుకుంటున్నారు.