కోలీవుడ్ పరిశ్రమ ఇంత వరకూ 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఎంతో మంది స్టార్ హీరోలు..మరెంతో మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా 1000 కోట్ల క్లబ్ అన్నది ఇంత వరకూ సాధ్యపడలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసారు గానీ 1000 కోట్లు అందని ద్రాక్షగానే మారిపోతుంది. ఇటీవలే రిలీజ్ అయిన `కూలీ`తో ఆ మార్క్ సాధ్యమే అనుకున్నారంతా. ఈ సినిమాపై తమిళ పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది. ట్రేడ్ సైతం క్రియేట్ అయిన హైప్ తో కొట్టేయడం లాఛనంగా భావించింది. కానీ మరోసారి నిరాశ తప్పలేదు.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `కూలీ` బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. తొలి షో అనంతరం వచ్చిన రివ్యూలతో 500 కోట్లు కూడా కష్టంగా మారిందన్నది అర్దమైంది. మరి కోలీవుడ్ 1000 కోట్లు సాధించేది ఎప్పుడు? అంటే ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఆమార్క్ దరిదాపుల్లో ఏ చిత్రం కూడా లేదు. విజయ్ పొలిటికల్ నేపథ్యం లో `జన నాయగన్` చేస్తున్నాడు. కానీ 1000 కోట్లు వసూళ్లు చేసే సత్తా ఈ సినిమాకి లేదు. ఇది పాన్ ఇండియా సినిమా కూడా కాదు. సూర్య వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు.
అతడి మార్కెట్ కూడా డౌన్ అయింది. కార్తీ ఇమేజ్ తో ఇప్పుడే సాధ్యం కాదు. తదుపరి లోకేష్ కనగరాజ్ తోనే `ఖైదీ 2` ఉంది. కానీ లోకేష్ వైఫల్యాల కారణంగా `ఖైదీ 2`పై ప్రతికూలత తప్పదు. కార్తీ కూడా పాన్ ఇండియా స్టార్ కాదు. ఇవన్నీ సినిమాపై ప్రతికూల అంశాలే. విశ్వనటుడు కమల్ హాసన్ కైనా సాధ్య మతుందా? అంటే ఆయన్ని వైఫల్యాలు ఉంటాడుతున్నాయి. మార్కెట్ లో ఆయన స్టార్ డమ్ బలం సరిపోదు. వీళ్లందరిలో బలమైన నాయకుడు ఎవరు? అంటే మళ్లీ సూపర్ స్టార్ రజనీకాంతే కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. `జైలర్` బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో 1000కోట్లకు దగ్గరగా ఉన్న స్టార్ ఎవరు అంటే ఎటూ చూసినా రజనీకాంత్ మాత్రమే కనిపి స్తున్నారు. మరి `జైలర్ 2` తో ఆ మార్క్ ని అందుకుంటారేమో చూడాలి.